హౌస్ ఫుల్ బోర్డులతో రవితేజ రచ్చ 💥

 హౌస్ ఫుల్ బోర్డులతో రవితేజ రచ్చ 💥



మాస్ మహారాజ్ రవితేజ హీరోగా, ప్రియా భవానిశంకర్ హీరోయిన్ గా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన చిత్రం "ఇరుముడి". శివ నిర్వాణ దర్శకుడు. ఇప్పటికే విడుదల అయిన పోస్టర్స్, సాంగ్స్, స్టిల్స్, ట్రైలర్ ఒకరెంజ్ లో బజ్ క్రియేట్ చేయగా,  ఈ చిత్రం ఈరోజు విడుదల అయింది. అన్ని చోట్లా బుకింగ్స్ చాలా బాగా అయ్యాయి. ఇక మన తెలుగు రాష్ట్రాల కంటే ముందుగా యూకేలో ప్రీమియర్ పూర్తి చేసుకుంది. ఇక సినిమా గురించి టాక్ ప్రకారం, ఇది వంద శాతం హిట్ సినిమా.. రవితేజ సాలిడ్ కంబ్యాక్ అని చెప్పొచ్చు.  ఒకప్పుడు రవితేజ స్టార్ హీరోలతో సమానంగా కలెక్షన్స్ సాధించే హీరో. కానీ గత కొంత కాలం నుండి ఎందుకో సరైన హిట్ లేక ఫాన్స్ ని నిరాశపర్చుతున్నారు. ఒకవేళ హిట్ అయినా కూడా యావరేజ్ కలెక్షన్స్ తో బాక్సాఫీస్ రన్ ముగిస్తున్నారు. ఇలాంటి కెరీర్ లో ఫేస్ లో వచ్చిన ఇరుముడి చిత్రం అందరిలో ఆసక్తి కలిగించింది. దాంతో ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకులు కూడా ఇరుముడి సినిమా చూడాలి అనుకుని థియేటర్లకు తరలి వచ్చారు. దాంతో చాలా థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డులతో ఓపెన్ అయ్యింది. B,C centres లో కూడా మంచి ఆక్యుపన్సీ కనిపించింది. ఇక బుక్ మై షోలో గంటలు 27వేలకు పైగా టికెట్స్ తో సంచలనం సృష్టిస్తుంది. ఇది టాప్ హీరోల సినిమాలకు జరిగే విశేషం. కానీ కెరీర్ ఫామ్ లో లేని రవితేజ సినిమాకు టాక్ రాకముందే ఈ రేంజ్ బుకింగ్స్ నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇక సినిమా టాక్ కూడా బాగుండటంతో మ్యాట్నీ అండ్ ఈవినింగ్ షోస్ కూడా అద్భుతంగా ఉంటుంది అని తెలుస్తుంది. ఇక అఫిషియల్ డే1 లెక్కలు ఎలా ఉంటాయో తెలియాలి అంటే రేపటి దాకా ఆగాల్సిందే. ఏదేమైనా రవితేజ తిరిగి ఫామ్ లోకి రావడం ఆనందించాల్సిన విషయం.

Post a Comment

Previous Post Next Post