రవితేజ హిట్ కొట్టేశాడు: "ఇరుముడి" మూవీ రివ్యూ 💥
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా, ప్రియా భవానిశంకర్ హీరోయిన్ గా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన చిత్రం "ఇరుముడి". శివ నిర్వాణ దర్శకుడు. ఇప్పటికే విడుదల అయిన పోస్టర్స్, సాంగ్స్, స్టిల్స్, ట్రైలర్ ఒకరెంజ్ లో బజ్ క్రియేట్ చేయగా, ఈ చిత్రం ఈరోజు విడుదల అయింది. అన్ని చోట్లా బుకింగ్స్ చాలా బాగా అయ్యాయి. ఇక మన తెలుగు రాష్ట్రాల కంటే ముందుగా యూకేలో ప్రీమియర్ పూర్తి చేసుకుంది. ఇక సినిమా గురించి టాక్ ప్రకారం, ఇది వంద శాతం హిట్ సినిమా.. రవితేజ సాలిడ్ కంబ్యాక్ అని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కంటే ఇంకా బాగుంది. రవితేజ చాలా బాగా నటించి, సినిమాకి మేజర్ హైలైట్ అయ్యారు, తన నుండి ఏదైతే కోరుకుంటామో ఆ నటన ఈ చిత్రంలో కనిపిస్తుంది. హీరోయిన్ ప్రియ భవాని శంకర్ నాచురల్ గా నటించింది. సాయికుమార్ మరోసారి గుర్తింపు గల పాత్ర చేసి మెప్పించారు. రవితేజ కూతురితో కాంబినేషన్ సీన్ లు ప్రేక్షకులని బాగా కనెక్ట్ చేస్తాయి. Gv ప్రకాష్ మ్యూజిక్ కూడా బాగుంది. గత రెండు సినిమాలుగా నిరాశపరుస్తున్న శివ నిర్వాణ చాలా జాగ్రత్తగా, ఈసారి ఎలా అయినా హిట్టు కొట్టాలి అనే కసి సినిమా ఆద్యంతం కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో సినిమా టెకప్ అవ్వడానికి కొంచెం టైమ్ తీసుకుని స్లోగా స్టార్ట్ అయినా, ఇంటర్వెల్ అండ్ సెకండ్ హాఫ్ యాక్షన్, స్టోరీ, ఎలివేషన్ , మల్లెపూల పల్లకి సాంగ్ ప్లేస్మెంట్ అండ్ క్లైమాక్స్ ఎమోషనల్ సీన్స్ అన్ని కలిపి సినిమా పూర్తి అయ్యేసరికి మంచి సినిమా చూసాం అన్న ఫీల్ తో ప్రేక్షకుడు థియేటర్ బయటకి రావడం ఖాయం. ఇక మన తెలుగు రాష్ట్రాల ఆడియన్స్ నుండి కూడా ఇలాంటి టాక్ వస్తే, బాక్సాఫీస్ దగ్గర రవితేజ రచ్చ చేసి భారీ వసూళ్లు సాధించడం పెద్ద విషయం ఏం కాదని చెప్పొచ్చు
#irumudi #irumudireview #MassmaharajRaviteja #Gvprakash #Mallepoolapallaki #MovieReviews
