సూర్య కి మరో పెద్ద బ్లాక్ బస్టర్ ఇది 💥💥👌🏻

సూర్య కి మరో పెద్ద బ్లాక్ బస్టర్ ఇది 💥💥👌🏻



తమిళం తో సమానంగా తెలుగులో మార్కెట్ సంపాదించుకున్న హీరో సూర్య. దాదాపు 25ఏళ్లుగా తెలుగులో స్థిరంగా మార్కెట్ ఉన్న హీరో ఆయన. 

శివపుత్రుడు, గజిని, ఆరు, దేవ, 7th sense, యముడు, 24 ఇలా ఎన్నో బ్లాక్బస్టర్ హిట్లు ఉన్నాయి. కానీ ఎన్నో ఏళ్ళ నుండి సరైన విజయం కోసం ఎదురు చూస్తున్న సూర్య ఈ సంవత్సరం వీరభద్రుడు/కరుప్పు తో భారీ కంబ్యాక్ ఇచ్చి, దాదాపు 350కోట్లు కొల్లగొట్టి తన రేంజ్ ఏ మాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించాడు. 

ఇక ఈ సినిమా ఇచ్చిన ఊపులో లక్కీ భాస్కర్ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో, సితార ఎంటర్టైన్మెంట్స్ తో చేసిన "విశ్వనాథ్ & సన్స్" ఈరోజు విడుదల అయింది. మమిత బిజూ హీరోయిన్ గా నటించిన ఈ క్లాస్ సినిమా మీద ముందు నుండే డీసెంట్ అంచనాలు ఉన్నాయి. సినిమాలోని నేనో బటర్ఫ్లై సాంగ్ కూడా బాగా హిట్ అయ్యింది. వీరభద్రుడు సినిమాతో AP-TG లో 35కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి ఇక్కడ సూర్య కెరీర్లోనే పెద్ద హిట్ గా నిలిచింది.

 ఇక విశ్వనాథ్ & సన్స్ సినిమా ఈరోజు విడుదల అయింది. సినిమా ఎలా ఉందో చూస్తే ఈ సంవత్సరం ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమా అని చెప్పుకోవచ్చు. అధిక శాతంలో పాజిటివ్ ఎలిమెంట్స్ ఉన్న ఈ సినిమా అందరికీ విపరీతంగా నచ్చుతుంది. క్లాస్ ట్రీట్మెంట్ తో మనసుకి హత్తుకునే ఎమోషన్స్ తో ఫ్యామిలీ మొత్తం కలిసి హాయిగా చూసే సినిమా ఇది. సూర్య, మమిత, రాధిక ఇలా అందరూ తమ పాత్రల్లో వంద శాతం న్యాయం చేశారు. మ్యూజిక్ కూడా బాగుంది. దర్శకుడు వెంకీ అట్లూరి తన శైలిలో ఎమోషన్స్ నీ పండించి సూపర్ సక్సెస్ చేశాడు.

ఈ సినిమాని, మౌత్ టాక్ తో ఈ సినిమా అల్టిమేట్ విజయం సాధిస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. Mixed talk తోనే వీరభద్రుడు పెద్ద బ్లాక్బస్టర్ గా నిలిచింది. ఇక ఈ సినిమా దానికి మించి ఉంది, ఇక long-run లో ఈ సినిమా ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. 


మా రేటింగ్ 3.75/5 


#ViswanathandSons #Suriya #MamithaBaiju #TeluguMovies #MovieReviews #ViswanathandSonsReview #Suriyanewmovie #SuriyaFans #LatestMovies #Cinema #Movies

Post a Comment

Previous Post Next Post