రచ్చ లేపుతున్న "ఇరుముడి" ప్రిరిలీస్ ఈవెంట్ లోని వ్యాఖ్యలు 😧😧
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా, ప్రియా భవానిశంకర్ హీరోయిన్ గా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న చిత్రం "ఇరుముడి". శివ నిర్వాణ దర్శకుడు. ఇప్పటికే విడుదల అయిన పోస్టర్స్, సాంగ్స్, స్టిల్స్ ఒకరెంజ్ లో బజ్ క్రియేట్ చేయగా, మొన్న విడుదల అయిన థియేట్రికల్ ట్రైలర్ అంచనాలను డబుల్ చేసింది. ఇక నిన్న జరిగిన ఇరుముడి ప్రిరిలీజ్ ఈవెంట్ చాలా ఉత్సాహంగా జరిగింది. టీం అంతా చాలా కాన్ఫిడెంట్ గా కనిపించారు. ఇది ఇలా ఉంటే ఈ ఈవెంట్ లో జరిగిన కొన్ని సంఘటనలు సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్నాయి. రవితేజ కూతురిగా నటించిన పాప, నాకు ఒక బిరుదు ఇస్తే, అది ఏం అయి ఉంటుంది అని అడగగా, రవితేజ సరదాగా "ముదురు ముండ" అని అన్నారు. ఇంకో నటుడు అజయ్ ఘోష్ ఒక అడుగు ముందుకు వేసి, ఒక పదజాలం వాడి తన ఎమోషన్ ని చెప్పుకున్నాడు. ఇది చాలా మంది సరదాగానే తీసుకున్నారు కానీ కొంత మంది మాత్రం సభా వేదికగా ఇలాంటి పదాలు వాడటం తప్పు అని ట్రోల్/కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఇరుముడి టీం మాత్రం ఒక పెద్ద హిట్ కొట్టబోతున్నాం అని గట్టిగా చెప్తున్నారు. "ఇరుముడి" ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది.
