విశ్వనాథ్ & సన్స్ హిట్ అవ్వాలంటే ఇంత రావాలా ? 🧐

విశ్వనాథ్ & సన్స్ హిట్ అవ్వాలంటే ఇంత రావాలా ? 🧐


ఎన్నో ఏళ్ళ నుండి సరైన విజయం కోసం ఎదురు చూస్తున్న సూర్య ఈ సంవత్సరం వీరభద్రుడు/కరుప్పు తో భారీ కంబ్యాక్ ఇచ్చి, దాదాపు 350కోట్లు కొల్లగొట్టి తన రేంజ్ ఏ మాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించాడు. ఇక ఈ సినిమా ఇచ్చిన ఊపులో లక్కీ భాస్కర్ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో, సితార ఎంటర్టైన్మెంట్స్ తో చేసిన "విశ్వనాథ్ & సన్స్" విడుదల అయింది. మమిత బిజూ హీరోయిన్ గా నటించిన ఈ క్లాస్ సినిమా మీద డీసెంట్ అంచనాలు ఉన్నాయి. సినిమాలోని నేనో బటర్ఫ్లై సాంగ్ కూడా బాగా హిట్ అయ్యింది. వీరభద్రుడు సినిమాతో APTg లో 35కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి ఇక్కడ సూర్య కెరీర్లోనే పెద్ద హిట్ గా నిలిచింది. ఇక విశ్వనాథ్ & సన్స్ సినిమా ఆంధ్రా తెలంగాణ లో కలిపి 21కోట్లు pre-release బిజినెస్ చేసుకుంది. హిట్ అనిపించుకోవాలి అంటే 22కోట్ల షేర్ రావాలి. ఇక ప్రపంచవ్యాప్తంగా 93 కోట్లు షేర్ రావాలి, 185కోట్ల గ్రాస్ రావాలి. హిట్ టాక్ పడితే సూర్య కి ఈ టార్గెట్ పెద్ద కష్టం ఏం కాదు. మరి ఈ సినిమాతో సూర్య తన హిట్ స్ట్రీక్ కంటిన్యూ చేయాలని కోరుకుందాం.

Post a Comment

Previous Post Next Post