ఇరుముడి ట్రైలర్ రివ్యూ : ఇది రవితేజ మాస్ వీరంగం 🔥

 ఇరుముడి ట్రైలర్ రివ్యూ : ఇది రవితేజ మాస్ వీరంగం🔥



మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ మీద శివనిర్వాణ దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ, ప్రియా భవాని శంకర్ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం "ఇరుముడి". నిన్ను కోరి, మజిలీ చిత్రాలతో అందరిని అలరించి మెప్పించిన శివ నిర్వాణ, ఆ తరవాత తీసిన టక్ జగదీష్, ఖుషీ చిత్రాలతో నిరాశపరిచారు. ఇటు మాస్ మహారాజ్ కూడా ధమాకా తర్వాత చేసిన ఏ సినిమా కూడా బాక్సాఫీస్ దెగ్గర మినిమమ్ యావరేజ్ రేంజ్ విజయం కూడా సాధించలేకపోయింది.ఇలాంటి తరుణంలో ఈ ఇద్దరి కలయికలో రూపొందిన ఈ ఇరుముడి చిత్రం షూటింగ్ దశ నుంచి కొంచెం పాజిటివ్ బజ్ తీసుకుంది, అంతే కాకుండా ఇరుముడి టీజర్, పోస్టర్లు కూడా ఇండస్ట్రీ వర్గాలతో పాటు, ప్రేక్షకుల్లో ఒక ఆశక్తి పుట్టించాయి. ఇక "ఇరుముడి" థియేట్రికల్ ట్రైలర్ ఇప్పుడు విడుదలైంది. ట్రైలర్ చూశాక అందరికి అనిపించిన ఒకటే మాట, "ఇది కచ్చితంగా మాస్ మహారాజ్ కంబ్యాక్". మనం ఎప్పటి నుండో మిస్ అవుతున్న పాత రవితేజ ని ఈ సినిమాలో చూడబోతున్నాం అనే నమ్మకం కలిగింది ట్రైలర్ చూసాకా.తండ్రి పాత్రలో రవితేజ బాగా ఒదిగిపోయాడు. ఇక తండ్రి, కూతురి ఎమోషన్ కూడా బాగా పండింది. రవితేజ భార్యగా నటించిన ప్రియా భవానీశంకర్ హోమ్లీగా కనిపించి మెప్పించింది. సినిమాలో యాక్షన్ కూడా చాలా బాగుంది, ట్రైలర్ కట్ కూడా చాలా క్రిస్పీగా కట్ చేసారు.జివి ప్రకాష్ సంగీతం కూడా ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ట్రైలర్ చూసాక సినిమా "విల్లాది వీరుడు" సాంగ్ సినిమాలో ఉంటుంది అని దాదాపు కన్ఫర్మ్ అయింది. సినిమాటోగ్రఫీ సహజంగా ఉంది. ట్రైలర్ లో సాయికుమార్ చెప్పిన "భయం అనేది ఆడపిల్ల భవిష్యత్తుకు అవసరం" అనే డైలాగ్ ట్రైలర్ కే హైలైట్. ట్రైలర్ తో సాలిడ్ బజ్ క్రియేట్ చేసిన "ఇరుముడి" ఆగస్ట్ 21న థియేటర్లలో రిలీజ్ అవ్వబోతుంది.ఇది శివనిర్వాణ, రవితేజ కెరీర్‌లో మంచి బ్లాక్‌బస్టర్ అవ్వాలని, వీరభద్రుడు, మా ఇంటి బంగారం, లెనిన్, చెన్నై లవ్‌స్టోరీ, స్పైడర్‌మ్యాన్, కొరియన్ కనకరాజు వరసలో థియేటర్లు మళ్లీ కలకలలాడాలి అని కోరుకుందాం. 
#irumudi #massmaharajaraviteja #raviteja #priyabhavanishankar #gvprakashkumar #telugucinema #irumuditrailer #irumudireview #irumudimovie #trending #news #movienews

Post a Comment

Previous Post Next Post