భారత్‌లో తొలి 500కోట్లు కొట్టిన హాలీవుడ్ చిత్రంగా నిలిచిన స్పైడర్‌మ్యాన్

భారత్‌లో తొలి 500కోట్లు కొట్టిన హాలీవుడ్ చిత్రంగా నిలిచిన స్పైడర్‌మ్యాన్ 



హాలీవుడ్ సినిమాలకు ఇండియాలో చాలా దశబ్దాల నుండి మంచి క్రేజ్ ఉన్న సంగతి అందరికి తెలిసిందే. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుండి యాక్షన్ సినిమాలు, జేమ్స్‌బాండ్ సినిమాలతో మొదలై, టైటానిక్, జురాసిక్ పార్క్, xxx, గాడ్జిల్లా, జాకీ చాన్, జెట్లీ చిత్రాలు, కింగ్‌కాంగ్, నార్నియా, మమ్మీ లాంటి సినిమా లు ఇక్కడ సినిమాలకు ధీటుగా వసూళ్లు సాధించాయి.ఇందులో 2012 యుగంతం, అవతార్, ఎవెంజర్స్, జంగిల్‌బుక్ సినిమాలూ మినహాయింపు కాదు.అయితే స్పైడర్‌మ్యాన్ సినిమాలకు అద్భుతమైన మార్కెట్ ఉంది భారత దేశం లో. 2002లో వచ్చిన స్పైడర్‌మ్యాన్ మొదటి భాగం నుండి పార్ట్2, 3 , యామేజింగ్ స్పైడర్‌మ్యాన్ ఇలా అన్నీ బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. ఇక రెండు వారాల ముందు విడుదలలా అయినా స్పైడర్‌మ్యాన్ బ్రాండ్ కొత్తరోజు సినిమా ముందు లేనట్టుగా, తొలిరోజు నుంచి భారతీయ సినిమాలకు ధీటుగా సంచలన వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతుంది.తెలుగులో కూడా స్ట్రెయిట్ సినిమాలను మించి వసూళ్లు సాధించిన ఈ సినిమా తొలిరోజు భారతదేశంలో 75కోట్లు గ్రాస్ సాధించి సంచలనం సృష్టించింది. 12రోజులకు గాను రికార్డు స్థాయిలో 508కోట్లు గ్రాస్ సాధించింది. ఇది అధికారికంగా సోనీపిక్చర్స్ వారే ప్రచురించారు.ఇంతకు ముందు 

అవతార్ 2 సినిమా 400 కోట్ల పైచిలుకు స్థూల తో మొదటి స్థానం లో ఉండగా, 373 కోట్లతో ఎవెంజర్స్ ఎండ్ గేమ్ ఉంది.

 ఇప్పుడు ఆ రికార్డ్ ను భారీ మార్జిన్ తో స్పైడర్ మ్యాన్ కేవలం 12రోజుల్లో తుడిచిపెట్టేసి ఊచకోత కోయడం విశేషం.

ఈరోజు వరకు స్థిరంగా రన్ అవుతున్న స్పైడర్‌మ్యాన్, ఫైనల్ రన్ లో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Post a Comment

Previous Post Next Post