చిరంజీవి, బాబీ సినిమా పేరు ఇదేనా ? 🫢😯💥👌🏻👌🏻
చిరు లీక్స్ లో మరొక ఆణిముత్యం 😂
ఇప్పటికే గతంలో చాలా ఈవెంట్స్ లో రాబోయే సినిమాల ఇన్ఫర్మేషన్ లీక్ చేసిన చరిత్ర ఉన్న మెగాస్టార్ చిరంజీవి గారు ఇటీవలే చేసిన ఇంకో లీక్, నెట్టింట్లో మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. వివరాల్లోకి వెళితే, మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన, గత వారం విడుదల అయిన కొరియన్ కనకరాజు సినిమా సక్సెస్ మీట్ లో ముఖ్య అతిథిగా హాజరైన మెగాసార్ట్ చిరంజీవి గారు తన తదుపరి చిత్ర టైటిల్ ను ఫ్లో లో లీక్ చేసి అందరిని ఆశ్చర్య పరిచారు. కొరియన్ కనకరాజు సక్సెస్ మీట్ లొ ఈ సంఘటన చోటు చేసుకుంది. యాంకర్ వచ్చి చిరంజీవి గారిని తన తదుపరి చిత్రమైన డైరెక్టర్ బాబీ తో చేయబోయే చిత్రం గురించి అడగగా, చిరు దేని గురించి? "కదిరి/కాకాజీ" గురించా ? అని ఆ సినిమా పేరు చెప్పకనే చెప్పారు. అంతే కాకుండా తన జన్మదినం సందర్భంగా ఆగస్టు 22న ఆ చిత్రం నుండి టీజర్ కూడా వస్తుంది అని, బాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా చేస్తున్నావా ? అని ఆ చిత్ర సంగీత దర్శకుడు Ss తమన్ ని బహిరంగంగా అడిగారు చిరంజీవి. ప్రస్తుతం చిరు చేసిన ఈ లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
