సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు

 

సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు



తెలుగు చలన చిత్ర సీమ గర్వంగా చెప్పుకునే నాటుల్లో సూపర్ స్టార్ కృష్ణ గారు ప్రముఖులు.  ఆయన నట వారసుడిగా రాజకుమారుడు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాతో తెరంగ్రేటం చేసి, అతి తక్కువ కాలం లోనే మురారి, ఒక్కడు, అతడు లాంటి హిట్స్ తో స్టార్ గా ఎదిగి, పూరి జగన్నాధ్ గారి దర్శకత్వం రికార్డ్ లో వచ్చిన పోకిరి సినిమాతో పాటు సినిమా లేదు ఆరోజుల్లోనే 70కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు చేసి టాలీవుడ్ సూపర్ స్టార్ అయ్యరు. ఆ తర్వాత ఖలేజా, సైనికుడు, అతిధి లాంటి ఫ్లాప్ లు వచ్చినా, మళ్లీ దూకుడు సినిమాతో 100కోట్లు సాధించి, బిజినెస్ మేన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి , సరిలేరు నీకెవ్వరూ,సర్కారు వారి పాట, గుంటూరు కారం తో వరస హిట్లు ఇచ్చిన ఆయన, ఇప్పుడు ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ SS రాజమౌళి గారితో కలిసి "వారాణాసి" చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి వచ్చిన సంగ్రహావలోకనం, సంచారి పాట విశేషంగా ఆకట్టుకోగా, ఈరోజు మహేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన స్టిల్స్ తో అభిమానులని అలరిస్తున్నారు. ఏప్రిల్ 7, 2024 విడుదలల అవ్వబోతున్న ఈ సినిమా ప్రపంచంలో విస్తృతంగా భారీ విజయం సాధించాలి అని కోరుకుందాం. 

Post a Comment

Previous Post Next Post