ఒకే రోజు రెండు సూపర్ స్టార్ లా సినిమా లు రిలీజ్?




ఒకే రోజు రెండు సూపర్ స్టార్ లా సినిమా లు రిలీజ్?



ఒకే రోజు రెండు సూపర్ స్టార్ లా సినిమా లు రిలీజ్ అయిన రోజు. అదే ఆగస్టు 10. ఆ రెండు సినిమాలే, ఒకటి తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన కల్ట్ క్లాసిక్ సినిమా అతడు, మరోకటి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ఆల్టిమేట్ బ్లాక్ బస్టర్ జైలర్. విశేషం ఏంటంటే ఈ రెండు ఈ హీరో లకి కమ్ బ్యాక్ సినిమాలూ. అత్తడుకి ముందు మహేష్ బాబు నాని,నిజం,అర్జున్ లాంటి సినిమా ఫ్లాప్ అవ్వడం తో హిట్ కోసం ఆతృతగా యెదురు చూస్తున్నాడు. అటు పక్కా రజినీ ఫ్యాన్స్ కూడా దర్బార్,పెద్దన్న లాంటి ఫ్లాప్స్ తో నిరాశలో ఉన్నారు. ఇలాంటి టైమ్‌లో వచ్చిన ఈ రెండు సినిమాలూ ప్రేక్షకులతో పాటు, అభిమానులు కూడా పండగ చేసుకునే సినిమాలుగా మిగిలాయి. అప్పట్లో అతడు సినిమా 175days aadi, 30కోట్లు గ్రాస్ వసూళ్లు చేసి హిట్ గా నిలిచాయి. జైలర్ సినిమా యెక్కంగా 600 కోట్లు కొల్లగొట్టి కోలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

అతడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 2005లో విడుదల అయిన ఒక తెలుగు సినిమా. ఇందులో హీరోగా మహేష్ బాబు నటించాడు. త్రిష కథానాయికగా నటించింది. డి. కిషోర్, ఎం. రామ్మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించగా జయభేరి ఆర్ట్స్ పతాకంపై మురళీ మోహన్ సమర్పకుడిగా వ్యవహరించాడు. మణిశర్మ సంగీత దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 3 నంది పురస్కారాలు, ఉత్తమ దర్శకుడి విభాగంలో దక్షిణాది ఫిల్మ్ ఫేర్ పురస్కారం గెలుచుకుంది. ఇది తమిళంలో నందు అనే పేరుతో, మలయాళంలో టార్గెట్ అనే పేరుతో అనువాదం అయింది. హిందీలో ఏక్ అనే పేరుతోనూ, బెంగాలీలో వాంటెడ్ పేరుతో పునర్మించారు. పోలండ్ లో Poszukiwany అనువాదం అయ్యి పోలండ్ లో విడుదలైన మొదటి తెలుగు సినిమాగా గుర్తింపు పొందింది. 2005లో ఈ సినిమాకు ఉత్తమ నటుడు, ఉత్తమ మాట రచయిత, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో నంది అవార్డు వచ్చింది. ఈ సినిమా 2025 ఆగస్టు 9 న మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా మళ్ళీ విడుదల చేశారు. 

జైలర్ 2023లో విడుదలైన యాక్షన్‌ కామెడీ సినిమా. సన్‌ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మింస్తున్న ఈ సినిమాకు నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించాడు.ఈ చిత్రం రజనీకాంత్ యొక్క 169వ చిత్రం అయిన తలైవర్ 169 అనే వర్కింగ్ టైటిల్‌తో ఫిబ్రవరి 2022లో అధికారికంగా ప్రకటించబడింది, జూన్‌లో అధికారికంగా జైలర్ అనే టైటిల్‌ను ప్రకటించారు. రజినీకాంత్, శివరాజ్‌కుమార్‌, మోహన్ లాల్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2023 ఆగష్టు 10న ఏషియన్‌ మల్టీప్లెక్స్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సంస్థలు విడుదల చేశాయి.

ఈ రీరిలీజ్ ద్వార అతడు సినిమా దాదాపు 7కోట్లు వసూళ్లు చేసింది. ఇప్పటికి ఈ సినిమా టీవీలో వస్తే చూస్తూ ఉండిపోతాం. జైలర్ కి సీక్వెల్ గా జైలర్2 సినిమా ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుంటుంది, ఈ చిత్రాన్ని అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Post a Comment

Previous Post Next Post