DC REVIEW : ఇది ఇది ఊహించనిది 😱
DC REVIEW : ఇది ఇది ఊహించనిది 😱
తమిళనాడుక్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఇప్పటికే దర్శకుడిగా నగరం,ఖైదీ,మాస్టర్,లియో,కూలీ చిత్రాలతో అద్భుతమైన విజయాలని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తను హీరోగా, ఇంతకు ముందు ధనుష్ తో కెప్టెన్ మిల్లర్ సినిమా తీసిన అతను దర్శకుడిగా, సన్ పిక్చర్స్ బ్యానర్ మీద కళానిధి మారన్ నిర్మించిన సినిమా డీసీ. అనిరుధ్ సంగీతం అందించిన ఈ సినిమాలో బాలీవుడ్ నటి వామిక గబ్బి హీరోయిన్ గా నటించింది. అసలు ఏ అంచనాలూ లేకున్నా థియేటర్స్ లో విడుదల అయినా ఈ సినిమా అసలు ఏ అంచనాలు లేకుండా , థియేటర్స్ లో మార్నింగ్ షోకే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.సినిమాకి అనిరుధ్ సంగీతం ప్రధాన బలం , ప్రతి సన్నివేశం తన సంగీతంతో ఇంకో స్థాయీకి తీసాడు, కథలో కూడా చాలా మంచి ఎమోషన్ ఉంది. నటీనటుల పెర్ఫార్మెన్స్ లు చాలా బాగున్నాయి, యాక్షన్ సీన్స్ చాలా నేచురల్ గా ఉన్నాయి, ముఖ్యం గా ఇంటర్వెల్ మరియు ఇంటర్వెల్, సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్, ఇలా ప్రేక్షకులను ఆకట్టుకునే సన్నివేశాలు చాలా ఉన్నాయి, కుటుంబ సమేతంగా చూడొచ్చు, అసభ్య సన్నివేశాలు లేకుండా, చాలా నీట్ గా ఉంది.రిలీజ్ కి ముందు డైరెక్టర్ కి హీరో పాత్ర ఏమైనా అవసరమా ? అని విమర్శించిన నోర్లు, సినిమా చూశాక అభిప్రాయం మార్చుకోవడం ఖాయం. హీరోయిన్ వామిక గబ్బి కూడా చాలా సహజంగా నటించి ప్రేక్షకులను అలరించింది.తెలుగు బాక్సాఫీస్ దెగ్గర చాలా స్లో గా మొదలైన సినిమా, మౌత్ టాక్ వల్ల మెల్లిగా కలెక్షన్స్ పుంజుకుంటుంది. లాంగ్ రన్ లో ఈ సినిమా చాలా మంచి లాభాలు కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ గా నిలవడం ఖాయం గా కనిపిస్తుంది. మరి ఈ చిత్ర బాక్సాఫీస్ వివరాలు త్వరలో పోస్ట్ చేస్తాం.
